Honda Activa EV | కొత్త లుక్ తో హోండా యాక్టివా ఎలక్ట్రిక్ స్కూటర్ వచ్చేసింది..
Honda Activa EV | హోండా మోటార్‌సైకిల్ & స్కూటర్ ఇండియా (HMSI) భారతదేశంలోని EV ద్విచక్ర వాహనాల్లోకి అధికారికంగా ప్రవేశించింది. హోండా నుంచి అత్యంత పాపులర్ అయిన యాక్టివా స్కూటర్ ఎలక్ట్రిక్ వెర్షన్‌ను ఇటీవలే విడుదల చేశారు. ఇది Activa e, యాక్టివా QC1 అనే రెండు మోడళ్లను ప్రవేశపెట్టింది.
Honda Activa e ఫీచర్లు
కొత్త హోండా యాక్టివా ఇ (Honda Activa e ) మోడల్ 6 kW పీక్ పవర్, 22 Nm టార్క్‌తో అంతర్గతంగా అభివృద్ధి చేయబడిన ఫిక్స్డ్ మాగ్నెట్ సింక్రోనస్ ఎలక్ట్రిక్ మోటారును కలిగి ఉంటుంది. హోండా 7.3 సెకన్లలో 0 నుండి 60 కి.మీ/గం వేగాన్ని అందుకోగలదు. గరిష్ట వేగం గంటకు 80 కి.మీ. యాక్టివా ఇ ఎకాన్, స్టాండర్డ్ మరియు స్పోర్ట్ అనే మూడు రైడింగ్ మోడ్‌లతో వస్తుంది.హోండా పవర్ ప్యాక్ ఎనర్జీ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్ అభివృద్ధి చేసి నిర్వహించే రెండు రిమూవబుల్ బ్యాటరీలతో వస్తుంది. ఈ రెండు బ్యాటరీలు 1.5 kWh కెపా...