
Dubai rains | ఎడారి దేశంలో ఆకస్మిక వర్షాలు, రోడ్లపై మోకాళ్ల లోతు వరద నీరు..
Dubai rains | మధ్యప్రాచ్య ఆర్థిక కేంద్రమైన దుబాయ్ ఇప్పుడు ఆకస్మిక వరదలతో కొట్టుమిట్టాడుతోంది. భారీ వర్షాల కారణంగా UAE, బహ్రెయిన్ అంతటా వరద నీరు పోటెత్తుతోంది. ఈ వరదల కారణంగా రెండు రోజుల్లో ఒమన్‌లో 18 మంది ప్రాణాలు కోల్పోయారు. వర్షం కారణంగా దుబాయ్ అంతర్జాతీయ విమానాశ్రయం అనేక ఇన్‌కమింగ్ విమానాలను దారి మళ్లించింది. అంతర్జాతీయ ప్రయాణికుల కోసం ప్రపంచంలోనే అత్యంత రద్దీగా ఉండే విమానాశ్రయం రాత్రి 7:26 గంటలకు రాకపోకలను నిలిపివేసింది, రెండు గంటల తర్వాత పునఃప్రారంభించినట్లు ప్రకటించింది.
సోషల్ మీడియాలో ప్రసారం అవుతున్న ఫొటోలు వీడియోలు అక్కడి దుస్థితిని వివరిస్తున్నాయి. ఫ్లాగ్‌షిప్ షాపింగ్ సెంటర్‌లు దుబాయ్ మాల్, మాల్ ఆఫ్ ఎమిరేట్స్ రెండూ వరదలకు గురయ్యాయి కనీసం ఒక దుబాయ్ మెట్రో స్టేషన్‌లో నీరు మోకాళ్ల లోతులో ఉందని సోషల్ మీడియాలో పోస్ట్ చేసిన వీడియోల ద్వారా తెలుస్తోంది.దుబాయ్‌లో కుండపోత...