Delhi Metro | హోలీ పండుగ వేళ మెట్రో రైలు వేళల్లో మార్పులు
Delhi Metro Timings | లక్నో/న్యూఢిల్లీ: హోలీ వేడుకల కారణంగా లక్నో, ఢిల్లీలో మెట్రో (Delhi Metro) సేవలు మార్చి 14న సాధారణ ఉదయం షెడ్యూల్‌కు బదులుగా మధ్యాహ్నం 2:30 గంటలకు ప్రారంభమవుతాయని అధికారులు ధృవీకరించారు. మార్చి 14న హోలీ సందర్భంగా మధ్యాహ్నం 2.30 గంటల వరకు ఎయిర్‌పోర్ట్ ఎక్స్‌ప్రెస్ లైన్‌తో సహా అన్ని ఢిల్లీ మెట్రో లైన్లలో రైలు సేవలు అందుబాటులో ఉండవని DMRC తెలిపింది.ఆ తర్వాత అన్ని లైన్లలో సాధారణ సేవలు ప్రారంభమవుతాయి."హోలీ పండుగ రోజు, మార్చి 14న, airport ఎక్స్‌ప్రెస్ లైన్‌తో సహా అన్ని ఢిల్లీ మెట్రో లైన్లలో మధ్యాహ్నం 2.30 గంటల వరకు మెట్రో సేవలు అందుబాటులో ఉండవు" అని ఢిల్లీ మెట్రో రైల్ కార్పొరేషన్ (DMRC) తెలిపింది. ఈ సేవలు అన్ని లైన్లలోని టెర్మినల్ స్టేషన్ల నుండి మధ్యాహ్నం 2.30 గంటలకు ప్రారంభమవుతాయి. ఆ తర్వాత యథావిధిగా కొనసాగుతాయని తెలిపింది. లక్నో, ఢిల్లీలోని ప్రయాణీకులు మార్చి 14న బయల...