
Dharani Portal | ధరణి పోర్టల్ పై సర్కారు కీలక నిర్ణయం.. కేంద్ర ప్రభుత్వ సంస్థకు నిర్వహణ బాధ్యతలు..
Dharani Portal | హైదరాబాద్ : ధరణి పోర్టల్ పై రాష్ట్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. పోర్టల్ నిర్వహణ బాధ్యతలను కేంద్ర ప్రభుత్వ సంస్థ ఎన్ఐసీ (నేషనల్ ఇన్ఫర్మేటిక్స్ సెంటర్)కి అప్పగిస్తూ ఈరోజు ఉత్వర్వులు జారీ చేసింది. రాష్ట్రంలోని వ్యవసాయ భూముల లావాదేవీలకు సంబంధించిన అంశాలను మూడు సంవత్సరాల పాటు నిర్వహించాలని, పనితీరు బాగుంటే మరో రెండేళ్లు పెంచుతామని రాష్ట్ర ప్రభుత్వం ఉత్వర్వుల్లో పేర్కొంది. గత బిఆర్ఎస్ ప్రబుత్వం 2020 అక్టోబర్ 29న ధరణి పోర్టల్‌ను అందుబాటులోకి తీసుకువచ్చి దాని నిర్వహణ బాధ్యతను టెర్రా సీఐఎస్ టెక్నాలజీస్ లిమిటెడ్ అనే కంపెనీకి కట్టబెట్టింది. అప్పటి నుంచి వ్యవసాయ భూముల అమ్మకాలు కొనుగోళ్లు పూర్తిగా ధరణి పోర్టల్ ద్వారానే కొనసాగుతున్నాయి. ఈ పోర్టల్లో ప్రస్తుతం 35 రకాల మాడ్యుల్స్ అందుబాటులో ఉన్నాయి. ప్రతీ సమస్యకు సంబంధించి రిజిస్ట్రేషన్ ఫీజులను ధరణి పోర్టల్ ఆన్లైన్...