ISKCON | ఇస్కాన్ చిన్మయ్ కృష్ణదాస్ ప్రభును అదుపులోకి తీసుకున్న బంగ్లా ప్రభుత్వం..!
ISKCON | హిందువులపై జరిగిన అకృత్యాలను నిరసించిన ఇస్కాన్‌కు చెందిన చిన్మయ్ కృష్ణ దాస్ ప్రభును బంగ్లాదేశ్ ప్రభుత్వం అరెస్టు చేసింది. ఢాకా నుంచి చిట్టగాంగ్ వెళ్లేందుకు ఆయన సోమవారం హజ్రత్ షాజలాల్ అంతర్జాతీయ విమానాశ్రయానికి చేరుకోగా.. పోలీసులు అదుపులోకి తీసుకొని ప్రశ్నిస్తున్నట్లు తెలిసింది. బంగ్లాదేశ్‌లో హిందువులపై జరుగుతున్న దాడులకు వ్యతిరేకంగా చిన్మయ్ ర్యాలీలు నిర్వహిస్తున్నారు. ప్రభు బంగ్లాదేశ్‌లోని సనాతన్ జాగరణ్ మంచ్ ప్రతినిధిగా వ్యవహరిస్తున్నారు. అక్టోబర్ 30న బంగ్లాదేశ్‌లో జాతీయ జెండాను అవమానించినందుకు గాను చిన్మయ్ కృష్ణ దాస్ ప్రభుతో సహా 13 మందిపై కేసు నమోదైంది. ఇప్పటికే ఈ కేసులో ఇద్దరిని అరెస్టు చేశారు.
అక్టోబర్ 25న లాల్దిఘి ర్యాలీలో బంగ్లాదేశ్ జాతీయ జెండా కంటే ఎత్తున ఇస్కాన్‌కు చెందిన కాషాయరంగు జెండా ఎత్తులో ఎగురవేశారు. ఈ క్రమంలోనే పలువురిపై దేశద్రోహం కేసులు నమోదయ్యాయి...