Himachal Pradesh | ఫాస్ట్ ఫుడ్, హోటళ్లలో నిర్వాహకుల వివరాలను ప్రదర్శించాల్సిందే.. లేకుంటే కఠిన చర్యలు తప్పవు..
Himachal Pradesh : తినుబండారాల స్టాళ్లు, ఔట్‌లెట్ యజమానులు వారి వివరాలను తప్పనిసరిగా ప్రదర్శించాలని హిమాచల్ ప్రదేశ్ ప్రభుత్వం బుధవారం ఉత్తర్వులు జారీ చేసింది. పబ్లిక్ వర్క్స్ అర్బన్ డెవలప్‌మెంట్ , మున్సిపల్ కార్పొరేషన్‌తో జరిగిన సమావేశంలో ఈ ఉత్తర్వులు జారీ చేసినట్లు కాంగ్రెస్ నేత, రాష్ట్ర మంత్రి విక్రమాదిత్య సింగ్ తెలిపారు.మేము అర్బన్ డెవలప్‌మెంట్ , మునిసిపల్ కార్పొరేషన్ అధికారులతో సమావేశం నిర్వహించామని, పరిశుభ్రమైన ఆహారం విక్రయిస్తున్నారని నిర్ధారించుకోవడానికి, వీధి వ్యాపారులందరికీ.. ముఖ్యంగా తినుబండారాలను వస్తువులను విక్రయించే వారి కోసం ఒక నిర్ణయం తీసుకున్నామని విక్రమాదిత్య మీడియాకు తెలిపారు. .వీధుల్లో విక్రయించే ఆహార పదార్థాల పరిశుభ్రతపై ప్రజలు ఆందోళనలు, సందేహాలను వ్యక్తం చేశారని ఆయన అన్నారు. దీనిని పరిగణనలోకి తీసుకుని, యుపిలో అమలు అవుతున్న విధానాన్ని ఇక్కడ కూడా ప్రవేశ...