Saturday, August 30Thank you for visiting

Tag: devotees

శ్వేతార్క గణపతి ఆలయంలో నేటి నుంచి  శ్రావణ మాసోత్సవాలు

శ్వేతార్క గణపతి ఆలయంలో నేటి నుంచి శ్రావణ మాసోత్సవాలు

Local
Kazipet:  హన్మకొండ జిల్లా కాజీపేటలోని ప్రసిద్ధ శ్రీ శ్వేతార్క గణపతి ఆలయంలో శుక్రవారం నుంచి (ఆగస్టు 18 ) శ్రావణ మాసోత్సవాలు ప్రారంభమయ్యాయి. ఈమేరకు ఆలయ కమిటీ ఒక ప్రకటనలో వెల్లడించింది.ఆగస్టు 18న సంతోషిమాతకు అభిషేకం, 19న శనివారం వేంకటేశ్వర స్వామివారికి పూజలు, అభిషేకాలు, 20న సంతాన నాగలింగేశ్వరస్వామికి అభిషేకం, 21న సోమవారం నాగేంద్రుడికి, 22న గాయత్రి అమ్మవారికి, 25న శుక్రవారం సామూహిక వరలక్ష్మి వ్రతాలు నిర్వహించనున్నారు. 26న శనివారం వేంకటేశ్వరస్వామివారికి ప్రత్యేక పూజలు, అలాగే సామూహిక విష్ణు సహస్ర నామ పారాయణం, 27న ఆదివారం ఉదయం లక్ష్మీ నారాయణ హోమం, 31న గురువారం సాయంత్రం రక్షా బంధన్ విశేష పూజలు జరగనున్నాయి. సెప్టెంబర్ 2న శనివారం శ్రీ వేంకటేశ్వర స్వామివారికి ప్రత్యే క పూజలు, సెప్టెంబర్ 3న సంకటహర చతుర్థి, శ్వేతార్కమూల గణపతి స్వామివారికి గంధం మరియు పుష్పాభిషేకం నిర్వహించనున్నారు. సెప్టెంబరు 6న బు...
అత్యంత పవిత్రమైన శ్రావణ మాసం.. ప్రతిరోజూ పండుగలా..

అత్యంత పవిత్రమైన శ్రావణ మాసం.. ప్రతిరోజూ పండుగలా..

Special Stories
పరమ పవిత్రమైన శ్రావణ మాసంలో ప్రతి ఇంటిలో ఆధ్యాత్మిక పరిమళాలు వికసిస్తాయి. నెల రోజుల పాటు ఉదయం, సాయంత్రం వేళల్లో పూజా కార్యక్రమాలలతో సందడి నెలకొంటుంది. శ్రావణంలో చేపట్టే ఎలాంటి కార్యానికైనా పవిత్రత ఉంటుందనేది వేద పండితుల మాట. ఎంతో గొప్పదైన పవిత్రమాసం ఈ రోజు (ఆగస్టు 17)న ప్రారంభమైంది. అంతేకాకుండా ఈ మాసంలో ఎన్నో మంచి రోజులు, విశిష్టమైన పండుగలు వస్తున్నాయి.సనాతన ధర్మంలో (హిందూ) చంద్ర మానం ప్రకారం మనకున్న 12 మాసాల్లో ఎంతో పవిత్రత కలిగింది ఈ శ్రావణమాసం. ఈ నెలలో  పౌర్ణమి రోజు చంద్రుడు శ్రావణ నక్షత్రంలో సంచరించడం వల్ల ఈ మాసానికి శ్రావణమాసమని పేరు వచ్చింది. వర్ష రుతువు ప్రారంభమవుతుంది.. త్రిమూర్తుల్లో స్థితికారుడు.. దుష్ట శిక్షకుడు.. శిష్ట రక్షకుడైన మహా విష్ణువుకు ఆయన దేవేరి (భార్య) మహా లక్ష్మికి ఈ శ్రావణ మాసం అత్యంత ప్రీతికరమైనదిగా చెప్పుకుంటారు. వివిధ రకాల పూజలు, వ్రతాలు ఆచరించడం వల్ల విశేష ఫ...