
5 లక్షల 59వేల కోట్ల అప్పుల్లో తెలంగాణ!
ఆర్థికశాఖ సమీక్షలో భట్టివిక్రమార్క
శ్వేతపత్రాల విడుదలకు ప్రభుత్వం సిద్ధం..Deputy CM, Finance Minister Mallu Bhatti Vikramarka: తెలంగాణలో ఆర్థిక పరిస్థితిపై శ్వేతపత్రం విడుదల చేసేందుకు కాంగ్రెస్ ప్రభుత్వం సన్నద్ధమవుతోంది. గత శుక్రవారం ఆర్థికశాఖ అధికారులతో డిప్యూటీ సీఎం, ఆర్థిక శాఖ మంత్రి మల్లు భట్టివిక్రమార్క సమీక్ష నిర్వహించిన విషయం తెలిసిందే.. రాష్ట్ర ఆర్థిక స్థితిగతులు, ఆదాయ, వ్యయాలు, ఇతర పూర్తి వివరాలను ఆయన అడిగి తెలుసుకున్నారు. 2014 జూన్ 2వ తేదీ నుంచి ఇప్పటి వరకు రాష్ట్ర ఆదాయం, వ్యయాలపై శ్వేతపత్రం విడుదల చేయాలని మంత్రివర్గ సమావేశంలో తీర్మానించారు.కాగా తెలంగాణ రాష్ట్రం రూ. 5 లక్షల 59వేల అప్పుల్లో ఉందని, అయినప్పటికీ సవాల్ గా ఆర్థిక శాఖ బాధ్యతలను తీసుకున్నట్లు డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క (Bhatti Vikramarka) వెల్లడించారు. కాంగ్రెస్ పార్టీ ప్రకటించిన ఆరు గ్యారెంటీల...