Sunday, August 31Thank you for visiting

Tag: dead body

భూపాలపల్లి: వరద బీభత్సానికి గల్లంతైన మహిళ.. నాలుగు రోజులకు మృతదేహం లభ్యం

భూపాలపల్లి: వరద బీభత్సానికి గల్లంతైన మహిళ.. నాలుగు రోజులకు మృతదేహం లభ్యం

Local
భూపాలపల్లి : జయశంకర్ భూపాలపల్లి జిల్లాలో గురువారం సృష్టించిన వరద బీభత్సానికి మోరంచపల్లి గ్రామానికి చెందిన గొర్రె వజ్రమ్మ (63) మహిళ గల్లంతు కాగా.. ఆమె మృతదేహాన్ని ఆదివారం రాత్రి గుర్తించినట్లు భూపాలపల్లి సీఐ రామ్ నర్సింహారెడ్డి తెలిపారు. ఈ సందర్భంగా సీఐ మాట్లాడుతూ.. గురువారం మోరంచపల్లి లో నలుగురు వ్యక్తులు గల్లంతు కాగా వాగు పరిసర ప్రాంతాల్లోని ఆయా గ్రామాల యువకులు, ప్రజల సహకారంతో ముమ్మరంగా గాలింపు చర్యలు చేపట్టామని తెలిపారు. శనివారం రెండు మృతదేహాలు లభ్యం కాగా, ఆదివారం నేరెడుపల్లి సర్పంచ్, గ్రామస్థుల సహకారంతో గాలింపు చర్యలు చేపట్టగా.. నేరేడుపల్లి శివారు చిర్రకుంట చెట్ల పొదల్లో గొర్రె వజ్రమ్మ మృతదేహాన్ని గుర్తించామని తెలిపారు. ఇంకా మరొక మృతదేహం కోసం గాలింపుచర్యలు ముమ్మరం చేశామని పేర్కొన్నారు. ప్రజలకు ఎక్కడైనా మృతదేహాలు కనిపిస్తే వెంటనే పోలీసులకు సమాచారం అందించి సహకరించాలని సీఐ కోరారు....