AP Cyclone Alert | ముంచుకొస్తున్న ముప్పు.. బంగాళాఖాతంలో బలపడిన అల్పపీడనం
AP Cyclone Alert | ఏపీకి మళ్లీ వర్షాల ముప్పు ముంచుకొస్తోంది. దక్షిణ మధ్య బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం పశ్చి మ వాయువ్య దిశగా పయనిస్తూ బలపడి తీవ్రరూపం దాల్చి వాయుగుండంగా మారింది. ప్రస్తుతం నైరుతి బంగాళాఖాతంలో తమిళనాడుకు తూర్పు–ఆగ్నేయంగా 490 కిలోమీటర్లు, పుదుచ్చేరికి తూర్పు–ఆగ్నేయంగా 500 కిలోమీటర్లు నెల్లూరుకు ఆగ్నేయంగా 590 కి.మీ.దూరంలో ఈ వాయుగుండం కేంద్రీకృతమై ఉంది. ఇది ఈ నెల 17న తెల్లవారుజామున చెన్నైకి దగ్గరగా పశ్చిమ–వాయువ్య దిశగా పయనించి ఉత్తర తమిళనాడు–దక్షిణ ఆంధ్రప్రదేశ్…