
Congress Jana Jathara | మహిళలకు ఏటా లక్ష రూపాయిలు నేరుగా బ్యాంకులో జమ
Congress Jana Jathara తెలంగాణలో కలకలం సృష్టించిన ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంపై అగ్రనేత రాహుల్ గాంధీ (Rahul Gandhi) స్పందించారు. తుక్కుగూడ (Tukkuguda Sabha) సభావేదికగా ఆయన మాట్లాడుతూ.. గత ప్రభుత్వం ఇంటెలిజెన్స్, పోలీసు విభాగాలను దుర్వినియోగం చేసి వేలాది మంది ఫోన్లను ట్యాప్ చేసిందన్నారు. ప్రభుత్వం మారగానే ఆ డేటాను పూర్తిగా ధ్వంసం చేశారని, తెలంగాణలో మాజీ ముఖ్యమంత్రి ఎలాంటి పనిచేశారో.. దిల్లీలో ప్రధానమంత్రి మోదీ కూడా అదే పనిచేస్తున్నారని విమర్శించారు. బీజేపీ వద్ద ప్రపంచంలోనే అతిపెద్ద ఓ వాషింగ్ మిషన్ ఉందని, దేశంలో అత్యంత అవినీతిపరులు మోదీతో ఉన్నారని మండిపడ్డారు. ఎన్నికల సంఘంలోనూ మోదీ తొత్తులున్నారని రాహుల్ గాంధీ ఆరోపించారు.
మహిళలకు ఏటా లక్ష!
తుక్కుగూడ (Congress Jana Jathara) సభ లో రాహుల్ గాంధీ మహిళలకు కీలక హామీ ఇచ్చారు. మహిళలకు ఏటా లక్ష రూపాయిలు నేరుగా బ్యాంకులో జమ చేస్తామని తెలిపారు. అలాగే యువత...