Rahul Gandhi | కాంగ్రెస్‌లో ‘సంస్థాగత’ చిచ్చు: దిగ్విజయ్ సింగ్‌పై రాహుల్ గాంధీ సెటైర్లు: “నువ్వు అల్లరి చేశావు”
బిజేపీ, ఆర్‌ఎస్‌ఎస్ సంస్థాగత బలాన్ని ప్రశంసించిన దిగ్విజయ్నష్టనివారణ చర్యల్లో దిగ్గీ రాజా.. కాంగ్రెస్ వర్కింగ్ కమిటీలో హాట్ టాపిక్న్యూఢిల్లీ, డిసెంబర్ 29: కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ (CWC) సమావేశానికి ముందు సీనియర్ నేత దిగ్విజయ్ సింగ్ చేసిన కొన్ని వ్యాఖ్యలు పార్టీలో రాజకీయ తుఫానును రేపాయి. బీజేపీ, ఆర్‌ఎస్‌ఎస్ (RSS) సంస్థాగత నిర్మాణాన్ని ఆయన బహిరంగంగా ప్రశంసించడంపై లోక్‌సభ ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ (Rahul Gandhi) ఆదివారం తనదైన శైలిలో స్పందించారు.ఏం జరిగింది?కాంగ్రెస్ 140వ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా ఏఐసీసీ ప్రధాన కార్యాలయంలో జరిగిన టీ విరామ సమయంలో రాహుల్ గాంధీ, దిగ్విజయ్ సింగ్‌లు ఎదురుపడ్డారు. ఈ సందర్భంగా రాహుల్ గాంధీ ఆయనతో కరచాలనం చేస్తూ నవ్వుతూ.. "నిన్న నువ్వు అల్లరి చేశావు" (You misbehaved yesterday) అని వ్యాఖ్యానించారు. దిగ్విజయ్ సింగ్ అంతకుముందు రోజు సోషల్ మీడియాలో బీజే...

