ఆది శంకరాచార్య 108 అడుగుల భారీ విగ్రహం ఆవిష్కరణ..
Adi Shankaracharya Statue : మధ్యప్రదేశ్ సీఎం శివరాజ్ సింగ్ చౌహాన్ ఓంకారేశ్వర్ లో 8వ శతాబ్దానికి చెందిన గొప్ప వేద పండితులు, గురువు ఆదిశంకరాచార్య 108 అడుగుల విగ్రహాన్ని ఆవిష్కరించారు. 'దీనికి ‘ఏకత్మాతా కి ప్రతిమా’ (ఏకత్వం యొక్క విగ్రహం ‘Statue of Oneness’ )' అని పేరుపెట్టారు. ఈ విగ్రహాన్ని నర్మదా నది ఒడ్డున గల ఓంకారేశ్వర్ లోని మాంధాత పర్వతంపై నిర్మించారు. అనేక లోహాలతో ఈ విగ్రహాన్ని తయారు చేశారు. విగ్రహం 54 అడుగల ఎత్తైన పీఠంపై ఉంది. దీనికి ‘ఏకత్మాతా కి ప్రతిమా’ (ఏకత్వం యొక్క విగ్రహం) అని పేరుపెట్టారు.
ఓంకారేశ్వర్ 12 జ్యోతిర్లింగాలలో ఒకటిగా గుర్తింపు పొందింది. శివుడిని ఆరాధించే పవిత్ర క్షేత్రం ఇది. మధ్యప్రదేశ్ లోని బీజేపీ ప్రభుత్వం ఓంకారేశ్వర్ లో ఓ మ్యూజియంతో పాటు ఆదిశంకరాచార్య విగ్రహం కోసం రూ.2,141.85 కోట్ల ప్రాజెక్టుకు గత సంవత్సరం ఆమోదం తెలిపింది. నర్మదా నది ఒడ్డున ఉన్న ఓంకారేశ్వర్ ఇండోర్ ...