రూ.130 కోట్లతో అభివృద్ధి చేసిన పరమ రుద్ర సూపర్ కంప్యూటర్ల పని ఏంటి?
Param Rudra Supercomputers | వాతావరణ మార్పులపై పరిశోధనల కోసం మూడు పరమ రుద్ర సూపర్ కంప్యూటర్లు, హై-పెర్ఫార్మెన్స్ కంప్యూటింగ్ (HPC) సిస్టమ్‌లను ప్రధాని నరేంద్ర మోదీ గురువారం ప్రారంభించారు. ఈ సూపర్ కంప్యూటర్‌లను భారతదేశంలో నేషనల్ సూపర్ కంప్యూటింగ్ మిషన్ (NSM) కింద అభివృద్ధి చేశారు. ఈ మూడు పరమ రుద్ర సూపర్‌కంప్యూటింగ్ సిస్టమ్‌ల తయారీకి సుమారుగా రూ. 130 కోట్లు ఖర్చు చేశారు.అధిక-పనితీరు గల సైంటిఫిక్ రీసెర్చ్, డెవలప్‌మెంట్‌కు సహకరించేందుకు పూణె, ఢిల్లీ, కోల్‌కతాలో వీటిని మోహరిస్తారు. వర్చువల్ ఈవెంట్ లో ఈ సూపర్ కంప్యూటర్‌లను మోదీ ప్రారంభించారు. తన ప్రసంగంలో దేశంలో కంప్యూటింగ్ సామర్థ్యం ప్రాముఖ్యతను ప్రధాని వెల్లడించారు.“పరమ రుద్ర సూపర్ కంప్యూటర్లు, హెచ్‌పిసి సిస్టమ్‌తో, భారతదేశం కంప్యూటింగ్‌లో స్వావలంబన దిశగా అడుగులు వేస్తుంది. సైన్స్ అండ్ టెక్నాలజీలో ఆవిష్కరణలను ముందుకు నడిపిస్తోంద...