
Cooking Oil | శరీరంలో కొలెస్ట్రాల్ తగ్గించడానికి మీరు వంట కోసం ఉపయోగించాల్సిన 5 రకాల నూనెలు
Best Cooking Oil For Health | ఈ రోజుల్లో మనం తినే ఆహారంతో కొలెస్ట్రాల్ (cholesterol) పెరగడం సర్వసాధారణం అయిపోయింది. ఇక బయటి ఆహారంలో నాసిరకమైన నూనెను వాడడమే కాకుండా ఒక్కసారి వాడిన నూనెను మళ్లీ మళ్లీ వినియోగిస్తారు. కల్తీ నూనెలు, నాసిరకమైన నూనెలతో వండిన తినుబండారాలు తినడం వల్ల శరీరంలో చెడు కొలెస్ట్రాల్ పెరుగుతుంది. కొలెస్ట్రాల్ అనేది కాలేయం నుంచి బయటకు వచ్చే మైనపు లాంటి పదార్థం. మనం గుడ్లు, మాంసం, చేపలు, పాలు లేదా దాని ఉత్పత్తులను తిన్నప్పుడు, శరీరంలో కొలెస్ట్రాల్ చేరుతుంది. కొబ్బరి నూనె, పామాయిల్, పామా కెర్నల్ ఆయిల్‌లో కనిపించే సంతృప్త కొవ్వు శరీరంలో చెడు కొలెస్ట్రాల్‌ను పెంచుతుంది. అందువల్ల, అధిక కొలెస్ట్రాల్ ఉన్న రోగి ఆహారంలో నూనెను చాలా జాగ్రత్తగా ఎంచుకోవాలి.శరీర కణాలను ఆరోగ్యంగా ఉంచడంలో కొలెస్ట్రాల్ సహాయపడుతుంది. కానీ దీనిని సరైన స్థాయిలో ఉండటం చాలా ముఖ్యం. ఎక్కువ నూనెలు గల ఆహారం (O...