Allu Arjun Remand | అల్లు అర్జున్‌కు బిగ్ షాక్, 14 రోజుల రిమాండ్
Allu Arjun Remand | పుష్ప 2 హీరో అల్లు అర్జున్ కు నాంపల్లి కోర్టులో ఊరట దక్కలేదు. అల్లు అర్జున్ కు నాంపల్లి కోర్టు 2 వారాల రిమాండ్ విధించింది. అల్లు అర్జున్ వేసిన పిటిషన్ ను కోర్టు తోసిపుచ్చింది. 14 రోజులపాటు జ్యుడిషీయల్ రిమాండ్ విధించింది. దీంతో పోలీసులు బన్నీని హైదరాబాద్ చంచల్ గూడ జైలుకు తరలించనున్నారు.ఆర్టీసీ క్రాస్ రోడ్డులోని సంధ్య థియేటర్ వద్ద ప్రీమియర్ షో సమయంలో జరిగిన తొక్కిసలాటలో రేవతి అనే మహిళ మృతి చెందగా మరో బాలులడు తీవ్రంగా గాయపడ్డాడు. ఈఘటనకు సంబంధించి ఇదివరకే బన్నీ తో సహా పలువురిపై కేసులు నమోదు చేసిన చిక్కడపల్లి పోలీసులు ఈరోజు మధ్యాహ్నం అల్లు అర్జున్‌ను అరెస్టు చేశారు. అనంతరం ఆయనను గాంధీ హాస్పిటల్ కు తరలించి వైద్య పరీక్షలు చేయించారు. ఆ తర్వాత నాంపల్లి కోర్టులో ప్రవేశపెట్టారు. కాగా తనపై నమోదైన అన్ని కేసులను క్వాష్ చేయాలని అల్లు అర్జున్ పిటిషన్ ...