Monday, September 1Thank you for visiting

Tag: Chinmay Krishna Das Prabhu

ISKCON | బంగ్గాదేశ్‌లో ఆగ‌ని ఆల‌యాల ధ్వంసం.. హిందువులే టార్గెట్‌

ISKCON | బంగ్గాదేశ్‌లో ఆగ‌ని ఆల‌యాల ధ్వంసం.. హిందువులే టార్గెట్‌

Trending News
Save Hindu in Bangladesh | బంగ్లాదేశ్‌లో హింసాత్మ‌క సంఘ‌ట‌న‌లు ఆగ‌డం లేదు. హిందూ ఆల‌యాల ధ్వంసం ఉదంతాలు వ‌రుస‌గా జ‌రుగుతూనే ఉన్నాయి. రెండు రోజుల్లో ఇవి మ‌రింత జోరందుకున్నాయ‌ని స్థానిక మీడియా వెల్ల‌డించింది. ఈ ఘ‌ట‌న‌ల్లో ప్ర‌మేయం ఉన్న 27 ఏళ్ల యువ‌కుడిని అరెస్టు చేశామ‌ని హలువఘాట్ పోలీసు స్టేషన్ ఇన్‌చార్జ్ అధికారి (OC) అబుల్ ఖయేర్ ఈ రోజు వెల్ల‌డించారు.హిందువులే ల‌క్ష్యంగా…గురు, శుక్రవారాల్లో తెల్లవారుజామున రెండు ఆలయాల్లో మూడు విగ్రహాలను దుండ‌గులు ధ్వంసం చేశారు. బంగ్లాదేశ్‌లోని హిందూ మైనారిటీల‌ను లక్ష్యంగా జరుగుతున్న దాడుల్లో భాగంగా ఇలాంటి వ‌రుస ఘ‌ట‌న‌లు అక్క‌డ చోటుచేసుకుంటున్నాయి. నవంబరు 29న చట్గ్రామ్‌లో మూడు ఆలయాలను దండ‌గులు ధ్వంసం చేశారు. ఈ దాడుల‌ను కోట్వాలి పోలీస్ స్టేషన్ చీఫ్ అబ్దుల్ కరీం ధృవీకరించారు. దుండగులు హింస‌ను ప్రేరేపించ‌డానికే ఇలాంటి దుశ్చ‌ర్య‌ల‌కు పాల్ప‌డుతున్నార‌ని ఆయన ...
ISKCON | ఇస్కాన్‌ చిన్మయ్‌ కృష్ణదాస్‌ ప్రభును అదుపులోకి తీసుకున్న బంగ్లా ప్రభుత్వం..!

ISKCON | ఇస్కాన్‌ చిన్మయ్‌ కృష్ణదాస్‌ ప్రభును అదుపులోకి తీసుకున్న బంగ్లా ప్రభుత్వం..!

Trending News
ISKCON | హిందువులపై జరిగిన అకృత్యాలను నిరసించిన ఇస్కాన్‌కు చెందిన చిన్మయ్‌ కృష్ణ దాస్‌ ప్రభును బంగ్లాదేశ్ ప్ర‌భుత్వం అరెస్టు చేసింది. ఢాకా నుంచి చిట్టగాంగ్‌ వెళ్లేందుకు ఆయన సోమవారం హజ్రత్‌ షాజలాల్ అంతర్జాతీయ విమానాశ్రయానికి చేరుకోగా.. పోలీసులు అదుపులోకి తీసుకొని ప్రశ్నిస్తున్నట్లు తెలిసింది. బంగ్లాదేశ్‌లో హిందువులపై జరుగుతున్న దాడులకు వ్యతిరేకంగా చిన్మయ్‌ ర్యాలీలు నిర్వహిస్తున్నారు. ప్రభు బంగ్లాదేశ్‌లోని సనాతన్‌ జాగరణ్‌ మంచ్‌ ప్రతినిధిగా వ్య‌వ‌హ‌రిస్తున్నారు. అక్టోబర్‌ 30న బంగ్లాదేశ్‌లో జాతీయ జెండాను అవమానించినందుకు గాను చిన్మయ్‌ కృష్ణ దాస్‌ ప్రభుతో సహా 13 మందిపై కేసు నమోదైంది. ఇప్పటికే ఈ కేసులో ఇద్దరిని అరెస్టు చేశారు. అక్టోబర్‌ 25న లాల్దిఘి ర్యాలీలో బంగ్లాదేశ్‌ జాతీయ జెండా కంటే ఎత్తున ఇస్కాన్‌కు చెందిన కాషాయరంగు జెండా ఎత్తులో ఎగురవేశారు. ఈ క్రమంలోనే పలువురిపై దేశద్రోహం కేసులు నమోదయ్యాయి...