Cherlapalli railway station | ప్రారంభానికి సిద్ధమైన చర్లపల్లి స్టేషన్.. ఇక్కడి నుంచి నడిచే ఎక్స్ ప్రెస్ రైళ్ల లిస్టు ఇదే..
Cherlapalli railway station : రైలు ప్రయాణికులకు గుడ్ న్యూస్.. మరికొద్ది రోజుల్లో చర్లపల్లి రైల్వే టెర్మినల్ అందుబాటులోకి రానుంది. పనులన్నీ పూర్తయి ప్రారంభోత్సవానికి సిద్దమైంది. ఈమేరకు చర్లపల్లి రైల్వే టెర్మినల్ ప్రారంభోత్సవంపై ఉన్నత స్థాయి సమీక్ష నిర్వహించారు. సోమవారం ఐటీ శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు.. మినిష్టర్ క్వార్టర్స్ లో నిర్వహించిన సమావేశంలో ఎంపీ ఈటల రాజేందర్ (MP Eetala Rajendar), మాజీ ఎమ్మెల్యేలు ఎన్వీఎస్ ప్రభాకర్, బేతి సుభాష్ రెడ్డి, ఎంబీసీ కార్పొరేషన్ మాజీ చైర్మన్ టి.శ్రీనివాస్, జీహెచ్ఎంసీ కమిషనర్ ఇలంబర్తి, టీజీఐఐసీ వైస్ ఛైర్మన్ అండ్ ఎండీ విష్ణువర్దన్ రెడ్డి, రైల్వే కన్ స్ట్రక్షన్ సీఈ సుబ్రమణ్యం, రైల్వే సీనియర్ డెన్ కోఅర్డినేషన్ రామారావు, కీసర ఆర్డీఓ పులి సైదులు, కాప్రా డిప్యూటీ కమిషనర్ పాల్గొన్నారు.ఈ సమావేశంలో రైల్వే స్టేషన్ కు అవసరమైన భూములు ఇచ్చేందుకు గాను టీజీఐఐసీ,...