Chandrayaan 3: చివరి నిమిషంలో ఇస్రో కీలక నిర్ణయం, ల్యాండింగ్ సమయంలో మార్పు
Chandrayaan 3: ఇస్రో అత్యంత ప్రతిష్టాత్మకంగా ప్రయోగించిన చంద్రయాన్ 3 ప్రయోగం సక్సెస్ కు మరి కొన్ని గంటలే మిగిలి ఉంది. చందమామపై విక్రమ్ ల్యాండర్ కాలు మోపే అద్భుత దృశ్యం యావత్ దేశం ప్రత్యక్ష ప్రసారం ద్వారా వీక్షించే వీలు కల్పించింది. అయితే చివరి నిమిషంలో ఇస్రో ల్యాంగింగ్ సమయాన్ని కొద్దిగా మార్చింది. ఇందుకు ఓ కారణముంది..చంద్రయాన్ 3 జాబిలి వైపు విజయవంతంగా దూసుకుపోతోంది. జూలై 14న శ్రీహరికోట లోని సతీష్ ధావన్ స్పేస్ సెంటర్ నుంచి విజయవంతంగా ప్రయోగించిన చంద్రయాన్-3 లక్ష్యానికి అత్యంత చేరువ అయింది. చంద్రుడి కక్ష్యలో కేవలం 25 కిలోమీటర్ల ఎత్తులో పరిభ్రమిస్తున్న విక్రమ్ ల్యాండర్.. ఆగస్టు 23 సాయంత్రం అంటే ఎల్లుండి బుధవారం సాయంత్రం చంద్రుని దక్షిణ ధ్రువంపై ల్యాండ్ కానుంది. ల్యాండర్ చంద్రుడిపై కాలుమోపే అద్భుత ఘట్టాన్ని ప్రజలందరూ చూసేందుకు ప్రత్యక్ష ప్రసారం చేయనున్నారు. ఇస్రో వెబ్‌సైట్, డీడీ నేషనల్, యూ...