Tirumala Laddu | దుమారం రేపుతున్న తిరుమల లడ్డూ వ్యవహారం..
Tirumala Laddu Controversy | కలియుగ ప్రత్యక్ష దైవం.. తిరుమల తిరుపతి వేంకటేశ్వరస్వామి దేవస్థానం అంటేనే ప్రపంచ వ్యాప్తంగా హిందువుల్లో ఆధ్యాత్మిక భావన కలుగుతుంది. అందులో తిరుమల లడ్డూ అనగానే అందరికీ ఎంతో పవిత్రమైనదిగా, ప్రతీకరమైనదిగా భావిస్తారు. అద్భుతమైన రుచికి ఈ లడ్డూకు ఎంతో ప్రసిద్ధి చెందింది. అయితే ఈ లడ్డూ తయారీ ఇప్పుడు వివాదాస్పదంగా మారింది. తిరుమల లడ్డూ తయారీలో గత ప్రభుత్వం ఆవు నెయ్యికి బదులుగా జంతువుల కొవ్వును ఉపయోగించారని ముఖ్యమంత్రి చంద్రబాబు ఆరోపించడం సంచలనం గా మారింది. ఇదే ఇప్పుడు సర్వత్రా దుమారం రేపుతోంది.చంద్రబాబు వ్యాఖ్యల్ని టీటీడీ మాజీ ఛైర్మన్లు కరుణాకర్ రెడ్డి, వైవీ సుబ్బారెడ్డి ఖండించారు. తిరుమల లడ్డూ తయారీలో కుటుంబంతో సహా ప్రమాణం చేసేందుకు సిద్ధమని ప్రకటించారు. కరుణాకర్ రెడ్డి సైతం చంద్రబాబు వ్యాఖ్యల్నితప్పుబట్టారు. విషప్రచారం చేస్తే స్వామి...