Railway Safety | పెరుగుతున్న రైలు ప్రమాదాల నివారణకు ఇకపై రైల్వే ఇంజన్లు, యార్డులపై AI- ఎనేబుల్డ్ సీసీ కెమెరాలు
Indian Railways | ఇటీవల కాలంలో దేశవ్యాప్తంగా పెరుగుతున్న రైలు ప్రమాదాలు అందర్నీ ఆందోళనకు గురిచేస్తున్నాయి. ఈ నేపథ్యంలోనే భారతీయ రైల్వే కీలక నిర్ణయం తీసుకుంది. రైల్వే భద్రత (Railway Safety) కోసం ఇకపై బోర్డు అన్ని ఇంజన్లు, కీలక యార్డుల వద్ద ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (AI) సాంకేతికతతో కూడిన CCTV కెమెరాలను ఏర్పాటు చేయాలని నిర్ణయించింది. ఈమేరకు ప్రయాగ్‌రాజ్ రైల్వే జంక్షన్‌లో విలేకరుల సమావేశంలో, రైల్వే బోర్డు చైర్‌పర్సన్, సీఈఓ జయ వర్మ సిన్హా వివరాలు వెల్లడించారు. అసాధారణ పరిస్థితులను గుర్తించేందుకు భద్రతా చర్యలను మెరుగుపరిచేందుకు ఈ AI- ఎనేబుల్డ్ కెమెరాలు కీలక పాత్ర పోషిస్తాయని చెప్పారు. "మేము ప్రతి లోకోమోటివ్, అన్ని ముఖ్యమైన యార్డ్‌లలో AI టెక్నాలజీతో పనిచేసే CCTV కెమెరాలను ఇన్‌స్టాల్ చేస్తున్నామనని ఆమె చెప్పారు.రైల్వే ట్రాక్ భద్రతను ప్రస్తావిస్తూ కుంభమేళా సందర్భంగా సంఘవిద్...