One Nation One Election : దేశవ్యాప్తంగా ఒకేసారి ఎన్నికలు.. ఈ విధానంతో ఇన్ని లాభాలా?
One Nation One Election : ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న 'ఒకే దేశం, ఒకే ఎన్నికలు' (ONOE) బిల్లుకు కేంద్ర మంత్రివర్గం గురువారం ఆమోదముద్ర వేసింది. ప్రధాని నరేంద్ర మోదీ అధ్యక్షతన జరిగిన మంత్రివర్గ సమావేశంలో తాజాగా ఈ నిర్ణయం తీసుకున్నారు . లోక్‌సభ, రాష్ట్రాల అసెంబ్లీలకు ఒకేసారి ఎన్నికలను అమలు చేసే దిశగా ముందడుగు వేస్తూ, ప్రస్తుతం జరుగుతున్న శీతాకాల సమావేశాల్లోనే బిల్లును ప్రవేశపెట్టవచ్చని పలు వర్గాలు భావిస్తున్నాయి. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు వేర్వేరుగా ఎన్నికలు జరగడంతో దేశంలో ప్రతి సంవత్సరం తరచూ ఏదో ఒకచోట ఎన్నికలను నిర్వహించాల్సివస్తోంది. దీంతో భారీగా వనరులు, సమయం వృథా అవుతోంది .'వన్ నేషన్, వన్ ఎలక్షన్' ఎందుకు?పెద్ద ఎత్తున డబ్బులు ఆదా..లోక్‌సభ, రాష్ట్రాల అసెంబ్లీలకు వేరువేరుగా ఎన్నికలు నిర్వహించడం వల్ల ప్రభుత్వం, రాజకీయ పార్టీలపై అధికంగా ఆర్థిక భారం పడుతుంది. ...