TGSRTC Bus Hire | ఆర్టీసీ బస్సులను అద్దెకు తీసుకునేవారికి టీజీఎస్ఆర్టీసీ భారీ డిస్కౌంట్
TGSRTC Bus Hire Discount | హైదరాబాద్ : తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ ( టిజిఎస్‌ఆర్‌టిసి ) వివాహాలు, కుటుంబ వేడుకలు, పార్టీలు మొదలైన వాటి కోసం అద్దెకు తీసుకున్న లేదా బుక్ చేసుకునే బస్సులపై ప్రత్యేక 10 శాతం తగ్గింపును ప్రకటించింది. ఈ తగ్గింపు డిసెంబర్ 31 వరకు అద్దె బస్సులపై మాత్రమే వర్తిస్తుంది.గతంలో కార్తీక మాసం, వనభోజనాలు, శబరిమల అయ్యప్ప యాత్రల, సమయంలో అద్దె లేదా కాంట్రాక్ట్ బస్సులకు ఆర్టీసీ రాయితీలు కల్పించింది . అయితే రానున్న పండుగలు, పెళ్లిళ్ల సీజన్ దృష్టిలో పెట్టుకొని క్షేత్రస్థాయి అధికారులు 10శాతం రాయితీ కల్పించాలని నిర్ణయించినట్లు ఆర్టీసీ అధికారులు తెలిపారు. శుభకార్యక్రమాల సమయంలో ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా ఉండేందుకు ఈ రాయితీని అందించినట్లు TGSRTC తెలిపింది.ప్రైవేట్ వాహనాల కంటే చాలా తక్కువ ధరలకు కార్పొరేషన్ బస్సులను అద్దెకు ఇస్తోంది. ముందస్తుగా నగదు జమ చేయకుండా...