CM Yogi | కాంగ్రెస్ పై విరుచుకుపడిన సీఎం యోగీ అదిత్యనాథ్
CM Yogi Adityanath | న్యూఢిల్లీ: ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ (UP CM Yogi Adityanath) కాంగ్రెస్‌పై తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. కాంగ్రెస్ పార్టీ "డాక్టర్ బిఆర్ అంబేద్కర్ (BR Ambedkar)ను అగౌరవపరుస్తోందని, దళితులు, అణగారిన వర్గాలను నిర్లక్ష్యం చేస్తోందని" ఆరోపించారు.మీడియా సమావేశంలో ఆదిత్యనాథ్ మాట్లాడుతూ, కాంగ్రెస్ కేవలం ముస్లింల గురించి మాత్రమే పట్టించుకుంటున్నదని ఆరోపించారు. నాడు అంబేద్కర్ ఎన్నికల్లో ఓడిపోవడానికి కాంగ్రెస్ కుట్ర పన్నిందని, ఆయన చేసిన సేవలను తగిన విధంగా గౌరవించలేదని సీఎం యోగీ ఆరోపించారు. బాబా సాహెబ్‌కు స్మారక చిహ్నాలు నిర్మించాలని కాంగ్రెస్ ఎన్నడూ ఆలోచించలేదని, అందుకు భిన్నంగా అంబేద్కర్ జీవితానికి సంబంధించిన ఐదు కీలక స్థలాలను గుర్తు చేస్తూ భారతీయ జనతా పార్టీ 'పంచతీర్థాన్ని' అభివృద్ధి చేసిందని ఆయన అన్నారు.ఎమర్జెన్సీ సమయంలో అప్పటి కాంగ్రెస్ ...