
BJP campaign video : 2024 లోక్‌సభ ఎన్నికల ప్రచార గీతాన్ని ఆవిష్కరించిన బీజేపీ
BJP campaign video : అయోధ్యలో బాల రాముడి విగ్రహ ప్రతిష్ఠ పూర్తి కావడంతో 2024 సార్వత్రిక ఎన్నికలపై దృష్టి సారించారు. ఈ క్రమంలో గురువారం బీజేపీ 2024 లోక్‌సభ ఎన్నికల ప్రచారాన్ని ప్రధాని నరేంద్ర మోడీ (PM Modi) లాంఛనంగా ప్రారంభించారు. ఈ సందర్భంగా పార్టీ అధ్యక్షుడు జెపి నడ్డా "సప్నే నహీ హకీకత్ బంతే హై, తాభీ తో సబ్ మోడీ కో చుంటే హై " అనే పాట (BJP song ) ను విడుదల చేశారు. మొదటి సారి ఓటర్ల సమ్మేళనం (నవ్ మత్తత సమ్మేళన్) లో జరిగిన ప్రచార ప్రారంభం సందర్భంగా కోట్లాది మంది భారతీయుల కలలు, ఆకాంక్షలను ప్రధాని మోదీ ఎలా నిజం చేశారో తెలిపే మ్యూజిక్ వీడియోను విడుదల చేశారు.ఈ సందర్భంగా జేపీ నడ్డా (JP Nadda) మాట్లాడుతూ.. ఈ ప్రచార నినాదం కేవలం కొద్దిమంది అనుభవించిన సెంటిమెంట్ మాత్రమే కాదు.. అది జనంలో ప్రతిధ్వనిస్తుందని బిజెపి గట్టిగా నమ్ముతుంది" అని పార్టీ పేర్కొంది. పార్టీ కార్యకర్తలందరూ దేశంలోని ప్రతి మూలక...