బైక్ ల చోరీల్లో ఆరితేరారు.. పలుమార్లు జైలుకెళ్లినా మారలేదు..
ఇద్దరు బైక్ దొంగలను అరెస్టు చేసిన వరంగల్ పోలీసులు
వరంగల్ పోలీస్ కమిషనరేట్ (warangal police commissionerate) పరిధిలో ద్విచక్ర వాహనాలు, తాళం వేసి ఉన్న షటర్లల్లో చోరీలకు పాల్పడుతున్న ఇద్దరు దొంగలను సీసీఎస్, మట్వాడా, సుబేదారి పోలీసులు సంయుక్తంగా అరెస్టు చేశారు. వీరి నుంచి సుమారు లక్షల రూపాయల విలువైన తొమ్మిది ద్విచక్రవాహనాలు, రూ1.60లక్షల నగదు, రెండు సెల్ఫోన్లను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు.ఈ అరెస్టుకు సంబంధించి వివరాలను క్రైమ్స్ ఏసీపీ మల్లయ్య వెల్లడించారు. మాట్వాడా పోలీసులు అరెస్టు చేసిన వరంగల్ పోచమ్మమైదాన్ కు చెందిన బరిపట్ల సాయి( 30) మద్యంతో పాటు చెడు వ్యసనాలకు అలవాటు పడి సులభంగా డబ్బు సంపాదించాలని నిర్ణయించుకున్నాడు. గతంలో వరంగల్ పోలీస్ కమికషనరప్ పాటు మహబూబాబాద్ జిల్లాలో పలు పోలీస్ స్టేషన్ల పరిధిలో చోరీలకు పాల్పడటంతో పోలీసులు పలుమార్లు అరెస్టు చేసి జైలుకు తరలించారు. నిందితుడిపై గతంలో...