Jio AirFiber vs Airtel Xstream AirFiber | జియో లేదా ఎయిర్ టెల్ వైర్ లెస్ బ్రాడ్‌బ్యాండ్ ప్లాన్లలో ఏది బెస్ట్..
Jio AirFiber vs Airtel Xstream AirFiber | దేశీయ ప్రైవేట్ టెలికాం కంపెనీలు అయిన రిలయన్స్ జియో, ఎయిర్‌టెల్ తమ వినియోగదారులకు అనేక ఆకర్షణీయమైన ప్లాన్లను ప్రవేశపెడుతున్నాయి. బ్రాడ్ బ్యాండ్ విషయంలో జియో ఎయిర్‌ఫైబర్, అలాగే ఎయిర్‌టెల్ ఎక్స్‌స్ట్రీమ్ ఎయిర్‌ఫైబర్ వంటి ఆఫర్‌లతో వైర్‌లెస్ బ్రాడ్‌బ్యాండ్ మార్కెట్లోకి తీసుకొచ్చాయి. ఇవి ఫిక్స్‌డ్ వైర్‌లెస్ యాక్సెస్ (FWA) టెక్నాలజీ కంటే అత్యాధునికమైనవి. సాంప్రదాయ ఫైబర్ ఆప్టిక్ కేబుల్స్ కంటే హై-స్పీడ్ ఇంటర్నెట్‌ని అందిస్తాయి.
ఫిక్స్‌డ్ వైర్‌లెస్ యాక్సెస్ (FWA)
Jio AirFiber మరియు Airtel Xstream AirFiber రెండూ సమీపంలోని టవర్‌ల నుంచి వైర్‌లెస్ సిగ్నల్‌లను రిసీవ్ చేసుకొని వాటిని మీ డివైజ్ లకు హై-స్పీడ్ ఇంటర్నెట్ అందిస్తుంది. దీంతో ఇంటర్నెట్ కేబుల్స్ అవసరం ఉండదు.. ఇది చాలా మంది వినియోగదారులకు మరింత అనుకూలమైన ఎంపికగా మారుతుంది. జ...