AI cameras | రోడ్లపై ఈ తప్పులు చేసి తప్పించుకోలేరు.. ఈ రాష్ట్రంలో రూ.90కోట్ల వరకు జరిమానాలు..
రోడ్లపై ఇష్టారాజ్యంగా వాహనాలు నడుపుతామంటే కుదరదు.. ఆర్టిఫిషియల్ ఇంటెలిజన్సీతో పనిచేసే ఈ హైటెక్ సీసీ కెమెరాలు (AI cameras) మిమ్మల్ని ఓ కంట కనిపెడుతూనే ఉంటాయి. ఏ చిన్ని తప్పు చేసినా ఇట్టే పసిగట్టి ఫొటోలు తీసి పోలీసులకు అందిస్తాయి. బెంగళూరు-మైసూరు హైవేపై ( Bengaluru-Mysuru highway ) ఏఐ కెమెరాలు 13 లక్షల ట్రాఫిక్ ఉల్లంఘనలను గుర్తించాయి. వీటి సాయంతో పోలీసులు గత మూడేళ్లలో రూ. 90 కోట్ల వరకు జరిమానాలు విధించారు. అయితే ఇందులో కేవలం 4కోట్లు మాత్రమే వసూలు చేయగలిగారు.119 కి.మీ 10-లేన్ బెంగళూరు-మైసూరు హైవే వెంబడి అమర్చిన ఇంటెలిజెంట్ ట్రాఫిక్ మేనేజ్‌మెంట్ సిస్టమ్ (ITMS) కెమెరాలు 2022-2024 మధ్యకాలంలో 13 లక్షల ట్రాఫిక్ ఉల్లంఘన కేసులను బుక్ చేశాయని కర్ణాటక హోం శాఖ వెల్లడించింది. ఈ నివేదిక ప్రకారం ఈ మూడేళ్లలో మొత్తం రూ.90 కోట్ల జరిమానాలు కూడా విధించగా అందులో రూ.4 కోట్లు మాత్రమే వ...