వీడియో: ఆటో డ్రైవర్.. చాకచక్యంగా మోసం చేశాడు.. పోలీసులకు చిక్కాడు..
బెంగళూరుకు చెందిన ఓ ఆటో డ్రైవర్.. బంగ్లాదేశ్ వ్లాగర్‌ని చాకచక్యంగా మోసం చేసి కెమెరాకు చిక్కాడు. దీనికి సంబంధించిన వీడియోను కోల్‌కతాకు చెందిన ఒక వ్లాగర్ ఎక్స్ (ట్విటర్ )లో షేర్ చేసి బెంగళూరు పోలీసులను ట్యాగ్ చేయడంతో ఈ సంఘటన పోలీసుల దృష్టికి వచ్చింది.
కోల్‌కతా వ్లాగర్ మృత్యుంజయ్ సర్దార్ ట్విట్టర్‌లో వివరాలు వెల్లడించారు. "బంగ్లాదేశ్ కు చెందిన వ్యక్తి అతడి స్నేహితురాలితో కలిసి బెంగళూరు పర్యటనకు వచ్చారు. బెంగళూరు ప్యాలెస్' ను సందర్శించిన తరువాత ఓ ఆటో ఎక్కగా ఆటో డ్రైవర్ చార్జీ చెల్లించే విషయంలో మోసం చేశాడు.బంగ్లాదేశ్ కు చెందిన వ్లాగర్.. MD ఫిజ్ మాట్లాడుతూ.. తాను, అతని స్నేహితురాలు బెంగళూరులో ఆటోలో వెళ్లాలని నిర్ణయించుకున్నారు. ఆటోడ్రైవర్‌తో మాట్లాడగా.. ఆటో మీటర్ చార్జీతో ఎక్కించుకునేందుకు అంగీకరించాడు. వారు గమ్యస్థానానికి చేరుకున్న తర్వాత, ఛార్జీ రూ.320 చూపించింది. వ్లాగర్ తన పర్సు నుంచ...