కళ్లు చెదిరేలా బేగంపేట రైల్వేస్టేషన్..
Begumpet Railway Station | తెలంగాణలోని బేగంపేట్ రైల్వే స్టేషన్ హైటెక్ హంగులు, అత్యాధునిక సౌకర్యాలతో తన రూపురేఖలనే మార్చుకుంటోంది. కేంద్రంలోని మోదీ ప్రభుత్వం దేశ వ్యాప్తంగా రైల్వే స్టేషన్‌లను అప్‌గ్రేడ్ చేయాలని నిర్ణయించింది. ఇందులో భాగంగా తెలంగాణలో అనేక రైల్వే స్టేషన్లను ఆధునీకరిస్తున్నారు. కాగా హైదరాబాద్ బేగంపేట రైల్వేస్టేషన్ లో కూడా 65 శాతం డెవలప్ మెంట్ పనులు పూర్తయ్యాయి. ఈ సమగ్ర పునరుద్ధరణ తర్వాత ప్రయాణికులకు మెరుగైన సౌకర్యాలు అందనున్నాయి. బేగంపేట రైల్వే స్టేషన్ ఆధునిక రవాణా కేంద్రంగా మారనుంది.ఏయే సౌకర్యాలున్నాయి?బేగంపేట స్టేషన్ లో అభివృద్ధి పనుల్లో చాలావరకు భాగాలు ఇప్పటికే పూర్తయ్యాయిఎంట్రీ ర్యాంప్ : కొత్త ఎంట్రీ ర్యాంప్‌ని ఏర్పాటు చేయడం ద్వారా స్టేషన్‌కి ప్రయాణికులు సులభంగా ప్రవేశించవచ్చు. విభిన్న రకాల ప్రయాణీకులకు ఇబ్బందులు లేకుండా ఈజీగా స్టేషన్ లోకి రాకపోకలు చేయవచ్చ...