Bulldozer action | ఆలయం సమీపంలోని మహిళల బాత్‌రూమ్‌లో సీసీటీవీ కెమెరా.. నిందితుడి ఇల్లు కూల్చివేత
Bulldozer action | ఉత్తరప్రదేశ్‌లోని ఘజియాబాద్‌లో మహిళల బాత్‌రూమ్‌లో సీసీటీవీ కెమెరాను అమర్చినందుకు మహంత్ ముఖేష్ గోస్వామి అనే ఆలయ పూజారిపై అధికారులు కేసు నమోదు చేశారు. ఆ ప్రాంతంలో ఏర్పాటు చేసిన సీసీటీవీ కెమెరాలను పరిశీలించగా విస్తుపోయే విషయాలు వెలుగులోకి వచ్చాయి. CCTV, దాని DVRలో 320 మంది మహిళలు, బాలికలకు సంబంధించిన రికార్డింగ్ వీడియోలు ఉన్నాయి.డిప్యూటీ కమిషనర్ ఆఫ్ పోలీస్ (రూరల్) వివేక్ చంద్ యాదవ్ తెలిపిన వివరాల ప్రకారం.. బాత్‌రూమ్‌లో సీసీటీవీ, దానికి సంబంధించిన డీవీఆర్ ను గుర్తించామని, DVRలో ఐదు రోజుల డేటా ఉంది. సీసీటీవీ ఫుటేజీని ప్రత్యక్షంగా ప్రదర్శించిన నిందితుడు మహంత్ గోస్వామి సెల్‌ఫోన్‌ను కూడా పరిశీలించారు. ప్రస్తుతం అతడు పరారీలో ఉన్నాడు. అతని అరెస్టు కోసం రెండు పోలీసు బృందాలను మోహరించారు. అతను ముందస్తు బెయిల్ కోసం అలహాబాద్ హైకోర్టును ఆశ్రయించాడు.ఇదిలా ఉండగా, బుల్‌డోజర్ చర్య...