Bank Holidays December 2024 : డిసెంబరులో 17 రోజుల పాటు బ్యాంకులకు సెలవులు!
Bank Holidays December 2024 : డిసెంబర్ 2024 లో ఏకంగా పలు రాష్ట్రాల్లో పండుగలు, ప్రాంతీయ, జాతీయ సెలవుల కారణంగా 17 రోజులు బ్యాంకులకు సెలవులు రానున్నాయి. అన్ని ప్రభుత్వ, ప్రైవేట్ బ్యాంకుల్లో మొత్తం 2 శనివారాలు, 5 ఆదివారం సెలవులు కూడా ఉంటాయి. రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (RBI) డిసెంబర్ లో బ్యాంక్ సెలవుల జాబితాను ప్రకటించింది. వీటిలో రాష్ట్ర సెలవులు, జాతీయ సెలవులు, ఆదివారాలు, రెండవ, నాల్గవ శనివారాల్లో సాధారణంగా బ్యాంకులు మూసివుంటాయి. కాబట్టి, మీ బ్యాంకింగ్ కార్యకలాపాలను ప్లాన్ చేయడానికి ముందు, సెలవుల జాబితాను చెక్ చేసుకోండి.డిసెంబర్ 2024లో బ్యాంక్ సెలవులు: డిసెంబర్‌లో బ్యాంక్ సెలవులు
ప్రాంతీయ సెలవులు కాకుండా, అన్ని బ్యాంకులు ఆదివారం, రెండవ, నాల్గవ శనివారాలు RBI ఆదేశాల ప్రకారం మూసివేస్తారు. RBI వెబ్‌సైట్ ప్రకారం, అన్ని షెడ్యూల్డ్, నాన్-షెడ్యూల్డ్ బ్యాంకులు రెండవ, నాల్గవ శనివారం ప్రభుత...