
India Drones : యుద్ధరంగంలో గేమ్‌చేంజర్ కానున్న భారత డ్రోన్ టెక్నాలజీ
భారత్‌లో తయారైన డ్రోన్‌లను అమెరికా, చైనా వ్యవస్థలు గుర్తించలేవు: రాజ్‌నాథ్ సింగ్India Drone Technology : నోయిడాలోని రాఫే ఎంఫిబర్ ప్రైవేట్ లిమిటెడ్‌లోని యువ శ్రామిక శక్తిని రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ (Rajnath Singh) శనివారం ప్రశంసించారు, భారత రక్షణ రంగాన్ని ముందుకు తీసుకెళ్లడంలో వారి పాత్రను హైలైట్ చేశారు. ఈ ఫెసిలిటీలో తయారైన డ్రోన్ (India Drones) లను అమెరికా లేదా చైనా అభివృద్ధి చేసిన ఏ రక్షణ వ్యవస్థలు గుర్తించలేవని ఆయన ధీమా వ్యక్తం చేశారు. రాజ్‌నాథ్ సింగ్, ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్‌తో కలిసి ఆదివారం ఈ సౌకర్యంలో రక్షణ పరికరాలు, డ్రోన్ తయారీ యూనిట్‌ను ప్రారంభించారు.ఈ సందర్భంగా రక్షణ మంత్రి మాట్లాడుతూ, "ఆత్మనిర్భర్ భారత్ (Atmanirbhar Bharat) ను సృష్టించడంలో ఇక్కడి యువత కీలక పాత్ర పోషిస్తున్నారు. భారత్ లో తయారైన డ్రోన్‌ల (India Drones) ను అమెరికా లేదా చైనాలో అభివృద్ధి...