
Pooja Pal | సీఎం యోగిని ప్రశంసించినందుకు ఎమ్మెల్యేపై అఖిలేష్ యాదవ్ ఆగ్రహం, పార్టీ నుంచి బహిష్కరణ
Prayagraj News | ప్రయాగ్‌రాజ్‌లోని చైల్ ఎమ్మెల్యే, రాజు పాల్ భార్య పూజ పాల్ (Pooja Pal) ను అఖిలేష్ యాదవ్ సమాజ్‌వాదీ పార్టీ నుంచి బహిష్కరించారు. యుపి అసెంబ్లీలో విజన్ డాక్యుమెంట్ 2047 పై చర్చ సందర్భంగా సమాజ్‌వాదీ ఎమ్మెల్యే పూజా పాల్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ (CM Adityanath)ను బహిరంగంగా ప్రశంసించారు. పూజ పాల్ వీడియో సోషల్ మీడియాలో వైరల్ కావడంతో అఖిలేష్ యాదవ్ ఆమెపై ఈ చర్య తీసుకున్నారు.ప్రయాగ్‌రాజ్‌కు చెందిన బహుజన్ సమాజ్ పార్టీ నాయకుడు రాజు పాల్‌కు అతిక్ అహ్మద్ సోదరుడు అష్రఫ్‌తో రాజకీయ వైరం ఉంది. 2004 నవంబర్‌లో ప్రయాగ్‌రాజ్ వెస్ట్ స్థానంలో జరిగిన ఉప ఎన్నికల్లో అతిక్ తమ్ముడు మహ్మద్ అష్రఫ్‌ను ఓడించి రాజు పాల్ విజయం సాధించారు. ఈ క్రమంలో ఆయన జనవరి 25, 2005న హత్యకు గురయ్యాడు. ఫిబ్రవరి 2023లో, హత్య కేసులో కీలక సాక్షి అయిన ఉమేష్ పాల్‌ను ప్రయాగ్‌రాజ్‌లోని సులేం సరయ్ ప్రాంతంలో గుర్తుతెలియని...