Independence Day 2024 | జాతీయ జెండాను సరిగ్గా ఎగురవేయడం ఎలా? చేయవలసినవి చేయకూడనివి తప్పకుండా తెలుసుకోండి..
Independence Day 2024 | యావత్ భారతదేశం 78వ స్వాతంత్ర్య దినోత్సవాన్ని ఘనంగా జరుపునేందుకు సిద్ధమైంది. ఈ సంవత్సరం వేడుకల థీమ్-వికసిత్ భారత్. 2047 నాటికి అభివృద్ధి చెందిన దేశంగా మారాలనే దేశం లక్ష్యాన్ని గుర్తుచేస్తుంది. స్వాతంత్ర్య ఉత్సవాల్లో భాగంగా దేశవ్యాప్తంగా పాఠశాలలు, కళాశాలలు, ప్రభుత్వ, ప్రవేట్ కార్యాలయాలు, బహిరంగ ప్రదేశాల్లో కులమతాలకు అతీతంగా అందరూ జాతీయ జెండాను ఎగురవేస్తారు. భారతావనికి స్వేచ్ఛను ప్రసాదించిన స్వాతంత్ర్య సమరయోధులను గర్తుచేసుకుని వారికి ఘనంగా నివాళులర్పిస్తారు.మన జాతీయ జెండా ఎంతో చారిత్రక, సాంస్కృతిక ప్రాముఖ్యతను కలిగి ఉంది. భారతీయ త్రివర్ణ పతాకం మూడు సమాంతర చారలను కలిగి ఉంటుంది: పైభాగంలో కాషాయం, మధ్యలో తెలుపు, దిగువన ఆకుపచ్చ, మధ్యలో నీలిరంగులో అశోక చక్రం ఉంటుంది.ప్రతి రంగు, చిహ్నం ముఖ్యమైన విలువలను సూచిస్తుంది: కాషాయ రంగు ధైర్యానికి...