ఘోర ప్రమాదం : లడఖ్‌లో వాహనం లోయలో పడి 9 మంది ఆర్మీ సిబ్బంది మృతి
లడఖ్‌లో ఘోర ప్రమాదం చోటుచేసుకుంది. లడఖ్‌లోని లేహ్ జిల్లాలో ట్రక్కు రోడ్డుపై నుండి జారి పడి లోతైన లోయలో పడటంతో తొమ్మిది మంది సైనికులు మరణించారు.. ఈప్రమాదంలో మరో అధికారి గాయపడినట్లు వార్త సంస్థ ANI నివేదించింది.మృతుల్లో ఎనిమిది మంది సైనికులు, ఒక జూనియర్ కమిషన్డ్ ఆఫీసర్ (JCO) ఉన్నారు. ట్రక్కు కరూ గ్యారీసన్ నుండి లెహ్ సమీపంలోని క్యారీకి వెళుతుండగా క్యారీ పట్టణానికి 7 కిలోమీటర్ల దూరంలో ఉన్న లోయలో పడిపోయింది. ఇది మొత్తం 34 మంది సిబ్బందితో ఒక SUV, అంబులెన్స్‌తో సహా దళంలో భాగం. మూడు వాహనాలు రెక్సే పార్టీ (recce party) నిర్వహణ లో ఉన్నాయి.దక్షిణ లడఖ్‌లోని నియోమాలోని కెరీ వద్ద శనివారం సాయంత్రం 6:30 గంటల ప్రాంతంలో ఈ ప్రమాదం జరిగింది. ఘటనా స్థలంలో సహాయక చర్యలు కొనసాగుతున్నాయని అధికారులు తెలిపారు.రాజ్ నాథ్ సింగ్ సంతాపంసైనికుల మృతి పట్ల రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ (Defence Minister Ra...