Sankranti Festival Special buses | సంక్రాంతి సందర్భంగా తెలుగు రాష్ట్రాలకు ప్రత్యేక బస్సులు
Sankranti Festival Special buses : సంక్రాంతి పండుగ (Sankranti Festival) సందర్భంగా తెలుగురాష్ట్రాల ప్రజలకు టీజిఎస్ఆర్‌టిసి శుభవార్త చెప్పింది. ప్రయాణికుల రద్దీకి అనుగుణంగా హైదరాబాద్ తో పాటు తెలంగాణలోని ప్రధాన నగరాలు ఆంధ్రప్రదేశ్‌కు 300 ప్రత్యేక బస్సులు సహా 6,500 ప్రత్యేక బస్సులను నడపనున్నట్లు టీజీఆర్టీసీ (TGSRTC) తెలిపింది.సాధారణ సర్వీసుల కంటే 1.5 శాతం ఎక్కువగా ఉంటుంది. జనవరి 7 నుంచి 15 వరకు హైదరాబాద్ నుంచి వివిధ ప్రాంతాలకు సర్వీసులు నడపనున్నారు. పల్లె వెలుగు, ఎక్స్‌ప్రెస్ కేటగిరీలకు చెందిన ఈ ప్రత్యేక బస్సులలో మహిళలకు ఉచిత ప్రయాణ సౌకర్యం వర్తిస్తుంది, కానీ రాష్ట్ర సరిహద్దుల్లో మాత్రమే. ప్రయాణికులకు మెరుగైన సౌకర్యాలు కల్పిస్తామని టీజీఎస్‌ఆర్టీసీ అధికారులు పేర్కొంటున్నారు. జనవరి 10న 1,600 బస్సులు, 1900 బస్సులు నడిచే జనవరి 11న భారీ డిమాండ్ ఉంటుందని అధికారులు అంచనా వేశారు. ప్రధ...