
Apple slashes iPhone prices | ఐఫోన్లపై బంపర్ ఆఫర్..! భారతదేశంలో iPhone 13, 14, 15 కొత్త ధరలు ఇవే..
iPhone | ఆపిల్ ఐఫోన్ ను కొనాలనుకునేవారికి శుభవార్త. టెక్ దిగ్గజం ఆపిల్ తన ఐ-ఫోన్ 13, 14, 15 సిరీస్ ఫోన్ల ధరలు భారీగా తగ్గిస్తున్నట్లు తాజాగా ప్రకటించింది. ఇటీవల 2024-25 ఆర్థిక సంవత్సర బడ్జెట్ లో కన్జూమర్ ఎలక్ట్రానిక్స్ పై కస్టమ్స్ డ్యూటీ తగ్గించినట్లు కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ప్రతిపాదనలు సమర్పించిన సంగతి తెలిసిందే. దీనికి అనుగుణంగా ఆపిల్ తన ఐ-ఫోన్ 13, 14, 15 సిరీస్ ఫోన్లపై ధరలను తగ్గించింది. ఈ నిర్ణయంపై భారతీయ వినియోగదారులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. ఆపిల్ ఐ-ఫోన్ ప్రో లేదా ప్రో మ్యాక్స్ మోడల్ ధరలు రూ.5,100 నుంచి రూ.6,000 వరకు తగ్గనున్నాయి. అలాగే ఐఫోన్ 13, ఐఫోన్ 14, ఐఫోన్ 15 సిరీస్ లతోపాటు భారత్ లో తయారవుతున్న ఐఫోన్ల ధరలు సుమారు రూ.300, ఐఫోన్ ఎస్ఈ ధర రూ.2300 వరకు తగ్గనుంది.Apple slashes iPhone prices : కాగా ఆపిల్ కంపెనీ తన ఐ-ఫోన్ ప్రో మోడల్ ఫోన్ల ధరలను ఇప్పటివరకు తగ్...