అమోల్డ్ డిస్‌ప్లేతో NoiseFit Vortex Smartwatch
దేశీయ కంపెనీ నాయిస్ కొత్తగా NoiseFit Vortex Smartwatch ను విడుదల చేసింది. ఐదు విభిన్న రంగు ఎంపికలలో వచ్చే ఈ స్మార్ట్‌వాచ్, బ్లూటూత్ కాలింగ్‌కు మద్దతుతో 1.46-అంగుళాల డిస్‌ప్లేను కలిగి ఉంది. నోయిస్‌ఫిట్ వోర్టెక్స్‌లో మెరుగైన కాలింగ్ కోసం ట్రూ సింక్ ఫీచర్ ను పొందుపరిచారు. ఇందులో 150 కంటే ఎక్కువ వాచ్ ఫేస్‌లతోపాటు హార్ట్ రేట్, బ్లడ్ ఆక్సిజన్ లెవెల్ సెన్సార్‌లు, స్లీప్ ట్రాకర్, స్టెప్ కౌంటర్‌తో సహా అనేక స్మార్ట్ హెల్త్ మానిటర్‌లు ఉన్నాయి. ఈ స్మార్ట్‌వాచ్ నీరు ధూళి నిరోధకత కోసం IP68-రేటింగ్‌ను కలిగి ఉంది. ఏడు రోజుల వరకు బ్యాటరీ లైఫ్ ను అందిస్తుందని కంపెనీ పేర్కొంది.
స్మార్ట్‌వాచ్ ధర
NoiseFit Vortex స్మార్ట్‌వాచ్ ప్రారంభ ధర రూ. 2,999. వీటి అమ్మకాలు జూన్ 12 మధ్యాహ్నం 12 గంటలకు ప్రారంభమవుతుంది. వాచ్‌ని NoiseFit వెబ్‌సైట్‌లో కొనుగోలు చేయవచ్చు. స్మార్ట్‌వాచ్ జెట్ బ్లాక్, సిల్వర్ గ్రే, వింటేజ్ బ్...