Allu Arjun | అల్లు అర్జున్ అరెస్టు.. అసలేం జరిగింది?
Allu Arjun : పుష్ప-2 సినిమా చూడ్డానికి వచ్చి తొక్కిసలాటలో ఓ మహిళ మృతి చెందిన కేసులో పాన్ ఇండియా స్టార్ అల్లు అర్జున్ శుక్రవారం అరెస్టు అయ్యారు. చిక్కడపల్లి పోలీసులు ఆయన్ను అదుపులోకి తీసుకున్నారు. ఈ ఘటనలో ఇప్పటికే ముగ్గురిని అరెస్టు కాగా అల్లు అర్జున్‌ను కూడా కావడం తీవ్ర కలకలం రేపింది. రెండు తెలుగు రాష్ట్రాల్లోనే కాకుండా యావత్ భారతదేశంలో ఉన్న ఆయన ఫ్యాన్స్ షాక్‌కు గురయ్యారు. సరైన ఏర్పాట్లు లేకపోవడం వల్లే ఆ మహిళ మృతి చెందని సంధ్యా థియేటర్ యజమానితోపాటు మేనేజర్‌ను, సరైన భద్రతా చర్యలు చేపట్టలేదని సెక్యూరిటీ మేనేజర్‌ను ఇప్పటికే పోలీసులు అరెస్టు చేసిన చిక్కడపల్లి పోలీసులు రిమాండ్‌కు తరలించారు. తాజాగా హీరో అల్లు అర్జున్‌ను కూడా అరెస్టు చేయడం, ఆయన్ను సెంట్రల్ జైలుకు పంపడం సంచనలం సృష్టించింది.పోలీసులు ఏమన్నారు?సంధ్యా థియేటర్ ఘటనపై పోలీసులు చేపట్టిన విచ...