
RSS చీఫ్ మోహన్ భగవత్ చెప్పిన ఒక గుడి, ఒక బావి, ఒక శ్మశానవాటిక నినాదం ఏమిటి?
Mohan Bhagwat On Casteism : రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్ (RSS) చీఫ్ మోహన్ భగవత్ 14 ఏళ్ల తర్వాత అలీఘర్‌లో 5 రోజుల పర్యటనలో ఉన్నారు. మోహన్ భగవత్ ప్రతి వేదిక నుంచి హిందూ ఐక్యతకు సంబంధించి అద్భుతమైన సందేశాన్ని ఇస్తారు. అలీఘర్‌లో కూడా సంఘ్ చీఫ్ హిందూ సమాజం నుంచి కుల భేదాలను తొలగించాల్సిన అవశ్యకతను వివరించారు. కులతత్వాన్ని నిర్మూలించడానికి 'ఒకే ఆలయం, ఒక బావి, ఒక శ్మశానవాటిక' అనే విధానాన్ని అవలంబించడం ద్వారా అన్ని వర్గాల మధ్య సమానత్వం పెంపొందించాలని ఆయన పిలుపునిచ్చారు.ఈ సంవత్సరం విజయదశమి సందర్భంగా ప్రారంభం కానున్న సంఘ్ శతాబ్ది ఉత్సవాల్లో భాగంగా మోహన్ భగవత్ అలీఘర్ పర్యటన సంఘ్ కార్యక్రమాల్లో కీలకమైనది. మోహన్ భగవత్ ఈ 5 రోజుల పర్యటన ముఖ్యంగా బ్రజ్ ప్రాంతంలో ఒక ముఖ్యమైన సంస్థాగత కార్యక్రమంగా చెప్పవచ్చు. మోహన్ భగవత్ 2 ప్రధాన శాఖలలో వలంటీర్లను ఉద్దేశించి ప్రసంగించారు. ప్రతీఒక్కరూ అన్ని వర్గాలకు సమాన గౌ...