Agricultural Projects | రైతులకు గుడ్ న్యూస్.. 13,966 కోట్ల విలువైన ఏడు వ్యవసాయ ప్రాజెక్టులకు ఆమోదం
Agricultural Projects | దేశంలో వ్యవసాయ రంగాన్ని ప్రోత్సహించేందుకు కేంద్ర మంత్రివర్గం సోమవారం రూ. 13,966 కోట్ల పెట్టుబడితో ఏడు కీలక ప్రాజెక్టులకు ఆమోదం తెలిపింది. దీనికి సంబంధించిన వివరాలను కేంద్ర మంత్రి అశ్విని వైష్ణవ్ విలేకరుల సమావేశంలో వెల్లడించారు. వ్యవసాయ పరిశోధన, డిజిటల్ వ్యవసాయం, స్థిరమైన పద్ధతులను అభివృద్ధి చేసేందుకు ప్రభుత్వం పటిష్టమైన చర్యలు చేపట్టిందని వివరించారు.
ఆహార, పోషకాహార భద్రత కోసం క్రాప్ సైన్స్: రూ. 3,979 కోట్లు
ఆహారం, పోషకాహార భద్రత కోసం crop science కోసం ప్రభుత్వం రూ.3,979 కోట్లు కేటాయించింది. ఈ ప్రాజెక్ట్ ఐదు రంగాలపై దృష్టి పెడుతుంది:
పరిశోధన - విద్య: వ్యవసాయంలో విద్యా, పరిశోధన సామర్థ్యాలను పెంపొందించడం.
మొక్కల జన్యు వనరుల నిర్వహణ: పంట అభివృద్ధి కోసం జన్యు వనరులను పరిరక్షించడం, ఉపయోగించడం.
ఆహారం, పశుగ్రాసం పంటలకు జన్యుపరమైన మెరుగుదల: పప్పుధాన్యాలు, నూన...