Accident
బస్సును ఢీకొన్న ట్రక్కు.. 11 మంది మృతి, 12 మందికి గాయాలు
భరత్పూర్:రాజస్థాన్‌లోని భరత్‌పూర్‌లో జాతీయ రహదారిపై బస్సును ట్రక్కు ఢీకొనడంతో 11 మంది మరణించారు. 12 మంది గాయపడ్డారు. బస్సు రాజస్థాన్‌లోని పుష్కర్ నుంచి ఉత్తరప్రదేశ్‌లోని బృందావన్‌కు వెళ్తుండగా తెల్లవారుజామున 4.30 గంటల ప్రాంతంలో ప్రమాదం జరిగినట్లు పోలీసులు తెలిపారు. బ్రిడ్జిపై నుంచి బస్సు బ్రేక్ డౌన్ కావడంతో రోడ్డుపై నిలిచిపోయింది.. బస్సు డ్రైవర్ తోపాటు కొంతమంది ప్రయాణికులు బస్సు వెనుక నిలబడి ఉండగా వేగంగా వచ్చిన ట్రక్కు బస్సును ఢీకొట్టడంతో ఈ ప్రమాదం చోటుచేసుకుంది. ఈ ప్రమాదంలో. […]
రోడ్డు ప్రమాదంలో కొడుకు మృతి.. మనస్తాపంతో తల్లి ఆత్మహత్య
కేరళలోని తిరువనంతపురం ప్రాంతంలో విషాదం చోటుచేసుకుంది. రోడ్డు ప్రమాదంలో తన కొడుకు చనిపోవడంతో మనస్తాపం చెందిన అతడి తల్లి బావిలో దూకి ఆత్మహత్యకు పాల్పడింది. తిరువనంతపురంలోని పాఠశాల ఉపాధ్యాయురాలుగా పనిచేస్తున్న షీజా బేగంకు భర్త, కొడుకు, కుమార్తె ఉన్నారు. కుమారుడు సజిన్ మహమ్మద్ వయనాడ్‌లోని ఒక కళాశాలలో మాస్టర్ ఆఫ్ వెటర్నరీ సైన్సెస్ చదువుతున్నాడు. కాగా గత మంగళవారం మధ్యాహ్నం అతని మోటార్‌సైకిల్‌ను జీపు ఢీకొనడంతో తీవ్ర గాయాలయ్యాయి. మహ్మద్‌ను ఆస్పత్రికి తరలించగా, చికిత్స పొందుతూ […]
వరంగల్ జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం.. లారీ ఆటో ఢీకొని ఆరుగురు మృతి
Warangal: వరంగల్ జిల్లాలో బుధవారం తెల్లవారుజామున ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. లారీ, ఆటో ఎదురెదురుగా ఢీకొనడంతో ఆరుగురు ప్రాణాలు కోల్పోయారు. మరో ముగ్గురు తీవ్ర గాయాలపాలయ్యారు. వరంగల్ నుంచి ఆటో తొర్రూరు వైపు వెళ్తుండగా.. ఎదురుగా వస్తున్న లారీ ఆటోను ఢీకొట్టింది. వర్ధన్నపేట మండలం ఇల్లంద గ్రామం వద్ద ఈ ప్రమాదం చోటుచేసుకుంది. ఈ ఘటనలో ఆటో డ్రైవర్ సహా.. అందులో ప్రయాణిస్తున్న మరో ముగ్గురు అక్కడికక్కడే చనిపోయారు.. అస్పత్రిలో చికిత్స పొందుతూ మరో ఇద్దరు […]
