Aadhaar free online update | మీ ఆధార్ ఇంకా అప్ డేట్ చేయలేదా.. మీకో గుడ్ న్యూస్..
Aadhaar card free online update | ఆధార్ కార్డును అప్‌డేట్ చేసుకోవాలనుకునే వారికి గుడ్ న్యూస్.. భారత విశిష్ట గుర్తింపు ప్రాధికార సంస్థ (UIDAI) మిలియన్ల కొద్దీ ఆధార్ దారులకు ఊరట కలిగిస్తూ ఉచిత ఆన్‌లైన్ డాక్యుమెంట్ అప్‌లోడ్ సౌకర్యాన్ని జూన్ 14, 2025 వరకు పొడిగించింది. ఈ ఉచిత సేవ కోసం గడువు మొదటగా జూన్ 14, 2024 వరకు విధించగా, ఆ తరువాత సెప్టెంబరు 14, 2024 వరకు పొడిగంచింది. ఇక తాజాగా మరోసారి ఎక్స్‌టెండ్ చేస్తూ అప్ డేట్ చేసుకునేందుకు మరోసారి డిసెంబర్ 14, 2024 వరకు తుది గడువు విధించింది.“#UIDAl ఉచిత ఆన్‌లైన్ డాక్యుమెంట్ అప్‌లోడ్ సౌకర్యాన్ని 14 జూన్ 2025 వరకు పొడిగించింది; లక్షలాది మంది ఆధార్ నంబర్ హోల్డర్లకు ప్రయోజనం చేకూరనుంది. ఈ ఉచిత సేవ #myAadhaar పోర్టల్‌లో మాత్రమే అందుబాటులో ఉంటుంది. #ఆధార్‌లో తాజా ధ్రవీకరణ పత్రాలను అప్‌డేట్ చేయాలని UIDL ” అని ఒక ట్వీట్‌లో పేర్కొంది. అసలు గడ...