Bangladesh | పాక్ చెరలోకి వెళ్తున్న బంగ్లాదేశ్.. ?
Bangladesh | బంగ్లాదేశ్ ఇస్లాంవాదులు, ప్రస్తుత పాలకుల తీరు తమ దేశాన్ని పాకిస్తాన్ వైపు మళ్లించేందుకు వేగంగా పావులు కదుపుతున్నట్లు తెలుస్తోంది. 1971లో బంగ్లాదేశ్ పాకిస్తాన్ నుంచి విడిపోయి స్వతంత్ర దేశంగా అవతరించిన తర్వాత మొట్టమొదటిసారిగా పాకిస్తాన్ వ్యవస్థాపకుడు.. మొహమ్మద్ అలీ జిన్నా వర్ధంతిని గత బుధవారం ఢాకాలో ఘనంగా నిర్వహించారు. ఇన్నాళ్లు బంగ్లాదేశ్ బద్దశత్రువుగా భావించిన జిన్నాను విచిత్రంగా 76వ వర్ధంతి ఢాకాలోని నేషనల్ ప్రెస్ క్లబ్‌లో కీర్తిస్తూ ప్రసంగాలు చేశారు. ముఖ్యంగా ఉర్దూలో జిన్నాను పొడిగేలా పాటలు పాడడమే కాకుండా.. కొందరు వక్తలు జిన్నాను 'జాతి తండ్రి'గా పేర్కొనాలని పిలుపునిచ్చారు.బంగ్లాదేశ్‌లో పాకిస్థాన్ డిప్యూటీ హైకమిషనర్ కమ్రాన్ దంగల్ హాజరైన ఈ కార్యక్రమంలో పలువురు వక్తలు బంగ్లాదేశ్‌లో మొహమ్మద్ యూనస్ నేతృత్వంలోని ప్రస్తుత పాలనకు అనుగుణంగా ఉన్నారు. ఈవెంట్‌లో చాలా మంది వక్తల ...