
Somnath Temple | వెయ్యేళ్ల వీరత్వానికి గుర్తుగా ‘సోమనాథ్ స్వాభిమాన్ పర్వ్’
Somnath Swabhimaan Parv 2026 | న్యూఢిల్లీ : భారతీయ నాగరికత, సాంస్కృతిక వారసత్వ స్ఫూర్తికి సోమనాథ్ ఆలయం (Somnath Temple) ఒక సజీవ సాక్ష్యం. క్రీ.శ. 1026లో గజినీ మహమూద్ చేసిన మొదటి భారీ దాడి నుంచి 2026 నాటికి వెయ్యి సంవత్సరాలు పూర్తవుతున్న సందర్భంగా, దేశవ్యాప్తంగా 'సోమనాథ్ స్వాభిమాన్ పర్వ్' (1026–2026) నిర్వహిస్తున్నారు. ఈ సందర్భంగా ప్రధాని నరేంద్ర మోదీ ప్రసంగిస్తూ.. సోమనాథ్ కేవలం ఒక దేవాలయం మాత్రమే కాదని, అది భారతదేశం యొక్క ఆత్మగౌరవ ప్రతీక అని పేర్కొన్నారు.జ్యోతిర్లింగాలలో ప్రథమం:గుజరాత్ తీరంలోని ప్రభాస్ పటాన్ వద్ద వెలసిన సోమనాథ్ స్వామి, ద్వాదశ జ్యోతిర్లింగాలలో మొదటివారు. ఋగ్వేదం, స్కందపురాణం, శివపురాణం వంటి పురాతన గ్రంథాలలో ఈ క్షేత్రానికి సంబంధించిన అనేక ప్రాముఖ్యతలు ప్రస్తావించబడి ఉంది. హిరణ్, కపిల, సరస్వతి నదులు అరేబియా సముద్రంలో కలిసే 'త్రివేణి సంగమం' వద్ద ఈ ఆలయం కొలువ...
