
ప్రధాని మోదీ కర్ణాటక పర్యటన: మూడు వందే భారత్ రైళ్లు, బెంగళూరు మెట్రో పసుపు లైన్ ప్రారంభం
Bengaluru Metro News : ప్రధానమంత్రి నరేంద్ర మోదీ (PM Narendra Modi) ఈరోజు (ఆగస్టు 10) కర్ణాటకలో పర్యటనకు రానున్నారు. ఈ సందర్భంగా, బెంగళూరులోని కెఎస్ఆర్ రైల్వే స్టేషన్‌లో ప్రధాని మోదీ మూడు వందే భారత్ ఎక్స్‌ప్రెస్ రైళ్ల (Vande Bharat Express)ను జెండా ఊపి ప్రారంభిస్తారు. వీటిలో బెంగళూరు - బెల్గాం, అమృత్సర్ - శ్రీ మాతా వైష్ణో దేవి కత్రా, నాగ్‌పూర్ (అజ్ని) - పూణే రైళ్లు ఉన్నాయి. దీని తరువాత, ఆయన బెంగళూరు మెట్రోలోని ఎల్లో లైన్ (Bengaluru Metro Yellow Line) ను జెండా ఊపి ప్రారంభించనున్నారు. అలాగే ఆర్‌వి రోడ్, రాగిగుడ్డ నుంచి ఎలక్ట్రానిక్ సిటీ మెట్రో స్టేషన్ వరకు మెట్రోలో ప్రయాణించనున్నారు. ప్రధానమంత్రి బెంగళూరులో పట్టణ కనెక్టివిటీ ప్రాజెక్టులను ప్రారంభించి, శంకుస్థాపన చేసి, బహిరంగ సభలో ప్రసంగిస్తారు.మూడు కొత్త రైళ్లు వాటి మార్గాలుKSR బెంగళూరు-బెళగావి వందే భారత్ ఎక్స్‌ప్రెస్ - ప్రధాన స...