Friday, January 23Thank you for visiting

Tag: కూల్చివేతలు

Delhi Turkman Gate | ఢిల్లీ తుర్క్‌మాన్ గేట్ వద్ద బుల్డోజర్ల గర్జన: అర్థరాత్రి అస‌లేం జ‌రిగింది?

Delhi Turkman Gate | ఢిల్లీ తుర్క్‌మాన్ గేట్ వద్ద బుల్డోజర్ల గర్జన: అర్థరాత్రి అస‌లేం జ‌రిగింది?

Trending News
న్యూఢిల్లీ: ఢిల్లీలోని చారిత్రాత్మక తుర్క్‌మాన్ గేట్ (Delhi Turkman Gate ) వద్ద మంగళవారం అర్థరాత్రి భారీ ఉద్రిక్తత చోటుచేసుకుంది. ఫైజ్-ఎ-ఇలాహి మసీదు సమీపంలోని అక్రమ కట్టడాలను తొలగించేందుకు ఢిల్లీ మున్సిపల్ కార్పొరేషన్ (MCD) చేపట్టిన బుల్డోజర్ ఆపరేషన్ రణరంగాన్ని తలపించింది.Turkman Gate : అర్ధరాత్రి ఏం జరిగింది?స్థానిక ప్రజలకు అసౌకర్యం కలగకుండా అధికారులు ఈ ఆపరేషన్‌ను అర్థరాత్రి ప్లాన్ చేశారు. అయితే అది ఘర్షణకు దారితీసింది. మంగళవారం రాత్రి 12:00 గంటల ప్రాంతంలో తుర్క్‌మాన్ గేట్ దగ్గర భారీగా పోలీసులు మోహరించారు. దాదాపు అరగంట తరువాత, 12:30 గంటల ప్రాంతంలో, మున్సిపల్ కార్పొరేషన్ 32 బుల్డోజర్లు, 50 డంప్ ట్రక్కులు, 200 మందికి పైగా కార్మికులతో సంఘటనా స్థలానికి చేరుకుంది. అధికారుల‌ ప్రణాళిక ప్రకారం, బుల్డోజర్లను రాత్రి 1 గంటలకు నడపాలి, కానీ ఈ సమయంలో ఆ ప్రాంతంలో జనసమూహం గుమిగూడడం ప్రారంభమైంది. ...