Etela Rajender | ఎక్కడికి రావాలో చెప్పండి.. రేవంత్ రెడ్డి సవాల్‌కు ఈటల సై
Etela Rajender Fires on CM Revanth Reddy | హామీల చర్చపై ముఖ్యమంత్రి రేవంత్ చేసిన సవాల్ ను స్వీకరిస్తున్నానని బిజెపి నేత, మల్కాజిగిరి ఎంపీ ఈటల రాజేందర్ తెలిపారు. హామీల అమలుపై చర్చకు ప్రధాని మోదీ అవసరంలేదని, ఎక్కడికి రావాలో చెబితే వచ్చేందుకు తాము సిద్ధమని చెప్పారు. కాంగ్రెస్ ఆరు గ్యారంటీలు మాత్రమే కాకుండా.. 420 హామీలపై చర్చిద్దామని ప్రతిసవాల్ విసిరారు. హైదరాబాద్ నాంపల్లిలోని బిజెపి కార్యాలయంలో జరిగిన ప్రెస్ మీట్ లో ఈటల రాజేందర్ మాట్లాడారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఏడాది ప్రజాపాలన వేడుకలపై ప్రజలు నవ్వుకుంటున్నారని, మెజార్టీ ప్రజలు కాంగ్రెస్ ప్రభుత్వం అన్ని రంగాల్లో విఫలమైందంటున్నారని ఎంపీ ఈటల అన్నారు.ముచ్చర్లలో గత ప్రభుత్వం 14 వేల ఎకరాలు భూ సేకరణ చేశారు. ఆ భూములు పోగొట్టుకున్న రైతులు కూలీలుగా మారారని ఆవేదన వ్యక్తంచేశారు. కాంగ్రెస్ పార్టీ మ్యానిఫెస్టోలో ఫార్మా సిటీ (Pharma city ) రద్దు చేసి...