Sunday, August 31Thank you for visiting

Watch: ఐదంస్తుల బిల్డింగ్‌ పై నుంచి దూకిన కుక్క.. వీడియో వైరల్‌

Spread the love

Super Dog | నిర్మాణంలో ఉన్న ఐదు అంతస్తుల బిల్డింగ్‌ పై నుంచి ఓ శునకం ఒక్కసారిగా కిందకు దూకింది. ఆతర్వాత తాపీగా నడుస్తూ వెళ్లిపోయింది. ఈ వీడియో సూపర్‌ డాగ్‌ స్టంట్‌కు (Super Dog Jumps Off Building) సంబంధించిన వీడియో సోషల్‌ మీడియాలో వేగంగా వైరల్‌ అయ్యింది.
న్యూఢిల్లీ: నిర్మాణంలో ఉన్న ఐదు అంతస్తుల భవనంపై నుంచి ఒక శునకం కిందకు దూకేసింది. అనంతరం తాపీగా నడుస్తూ వెళ్లిపోయింది. సూపర్‌ డాగ్‌ స్టంట్‌కు (Super Dog Jumps Off Building) సంబంధించి ఒక వీడియో క్లిప్‌ సోషల్‌ మీడియాలో వైరల్‌ అయింది. నిర్మాణంలో ఉన్న భవ‌నం ఐదో అంతస్తు అంచున నల్లని కుక్క నిల్చుని ఉంది. కొన్ని సెకన్ల తర్వాత అత్యంత సాహసోపేతమైన స్టంట్‌ చేసింది. కొన్ని అడుగులు వెనక్కి వేసి బిల్డింగ్‌ ఐదో అంతస్తు పై నుంచి కిందకు దూకింది. నేలను తాకిన తర్వాత వెంటనే తాపీగా నడుస్తూ వెళ్లిపోయింది.

మా WhatsApp ఛానెల్‌లో చేరండి.. WhatsAppలో తాజా అప్‌డేట్‌లు.. ప్రత్యేక వార్తలను చూడండి.. 

కాగా, సూపర్‌ డాగ్‌ స్టంట్‌ను మొబైల్‌ ఫోన్‌లో రికార్డు చేసిన వ్యక్తి ఎక్స్‌(ట్విటర్)లో పోస్ట్‌ చేశారు. ఇది ఎలా సాధ్యం? అని ప్రశ్నించారు. ఈ వీడియో క్లిప్‌ సోషల్‌ మీడియాలో వైరల్‌ అయ్యింది. ఈ నేపథ్యంలో నెటిజన్లు కూడా చాలా ఫన్నీగా స్పందించారు. పోలీస్‌ లేదా ఆర్మీ రిటైర్డ్‌ డాగ్‌ అయి ఉంటుందని ఒకరు చమత్కరించారు. గేమ్స్‌లో పాల్గొనేందుకు ఈ కుక్క ప్రాక్టీస్‌ చేస్తోందని మరొకరు కామెంట్ చేశారు. రియల్‌ లైఫ్‌ సూపర్‌ డాగ్‌ అంటూ కొందరు ప్రశంసించారు.

Green Mobility, Solar Energy, Environment కి సంబంధించిన తాజా సమాచారం కోసం హరితమిత్ర ను సందర్శించండి. తెలుగు వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోల కోసం వందేభారత్ వెబ్ సైట్ ను క్లిక్ చేయండి..

అలాగే  న్యూస్ అప్డేట్స్  కోసం గూగుల్ న్యూస్ (Google News), తోపాటు  ట్విట్టర్ లో సంప్రదించవచ్చు.

Whatsapp

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *